AP: వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం ఉందా? లేదా?.. ఉంటే ఎవరెవరిని విచారించాలో స్పష్టంగా చెప్పాలని సుప్రీంకోర్టు తెలిపింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై వైఎస్ సునీత అభ్యంతరం వ్యక్తం చేస్తూ..
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కి వాయిదా వేసింది.
