Home South Zone Andhra Pradesh APK ఫైల్స్ లింకును ఎవరు కూడా క్లిక్ చేయకండి : కర్నూలు జిల్లా పోలీసులు

APK ఫైల్స్ లింకును ఎవరు కూడా క్లిక్ చేయకండి : కర్నూలు జిల్లా పోలీసులు

0

కర్నూలు : కర్నూలు జిల్లాAPK ఫైల్స్ లింకులను ఎవరూ కూడా క్లిక్ చేయకూడదు…. మీ ఫోన్ లు హ్యాక్ చేస్తారు జాగ్రత్త !డిఐజి, జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ !!

• Apk ఫైల్స్ ను క్లిక్ చేసినట్లయితే వెంటనే మీ whatapp ను,  మీ ఫేస్ బుక్ లను  కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తారు జాగ్రత్త !• మీ ఫోన్ హ్యాక్ అయినట్టు తెలిస్తే వెంటనే మీ మొబైల్ ను ఫ్లైట్ మోడ్లో ఉంచి సైబర్ ల్యాబ్ పోలీసులను సంప్రదించాలి. • మీ ఫోన్ హ్యాక్ ఆయి సైబర్ నేరగాళ్ళచే మోసపోతారు.• ఎవరూ మోసపోకండి – సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండండి.ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించేందుకు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారని ,

గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్‌లు, డాక్యుమెంట్లు, APK ఫైల్‌లు ఓపెన్ చేయవద్దని డిఐజి, జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో తెలియజేశారుAPK ఫైల్స్ (Android Application Package Files) ద్వారా ప్రజల ఫోన్‌లను హ్యాక్ చేసి, వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డేటా, ఫోటోలు మరియు డాక్యుమెంట్లను దొంగలిస్తూ, ఆర్థిక నష్టానికి గురిచేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్లు హ్యాక్ అయినట్లు తెలిస్తే  వెంటనే సంబంధిత సైబర్ ల్యాబ్ పోలీసు అధికారులను సంప్రదించాలన్నారు.  మోసం చేయు విధానం

(Modus Operandi):1. నిందితులు WhatsApp, Telegram, Facebook Messenger, Instagram లేదా SMSల ద్వారా ఒక లింక్ పంపుతారు.2. “డెలివరీ బాయ్”, “రీఫండ్ లింక్”, “డిజిటల్ KYC, SBI rewards అప్డేట్, “ఫ్రీ గిఫ్ట్”, “అర్జెంట్ డాక్యుమెంట్, E chalan, PM కిసాన్ వంటి పేర్లు గల లింక్‌తో వినియోగదారులను ఆకర్షిస్తారు.3. ఆ లింక్ ద్వారా APK ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. దాన్ని యాప్ అనుకుని ఇన్‌స్టాల్ చేస్తాడు.4. ఈ అనుమతులతో నేరగాళ్లు మీ ఫోన్‌ను పూర్తిగా నియంత్రించగలుగుతారు.6. ఫోన్‌లోని OTPలు, బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ సమాచారం నేరుగా నిందితులకు అందుతుంది.7. కొన్నిసార్లు UPI యాప్‌లను కూడా నేరుగా యాక్సెస్ చేసి ఖాతాల్లోని డబ్బును దొంగిలిస్తారు.8. అదనంగా, కొన్ని సందర్భాల్లో ఫోన్‌ కెమెరా, మైక్ యాక్సెస్ చేసి వ్యక్తిగత వీడియోలు, ఆడియోలు సేకరించి బ్లాక్‌మెయిల్‌కు కూడా ప్రయత్నిస్తున్నారు.అమాయకులే లక్ష్యం.అంగవైకల్యం ఉన్నవారు, వృద్ధులు,ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారులు,రైతులు నిరుద్యోగులు,

విద్యార్థులు   డిఐజి, జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు జిల్లా ప్రజలకు సూచనలు చేశారు. జాగ్రత్తలు పాటించండి. మీ ఫోన్ హ్యాక్ అయినట్టు తెలిస్తే వెంటనే మొబైల్ ను ఫైట్ మోడ్ లో ఉంచి  సైబర్ ల్యాబ్ పోలీసులను సంప్రదించాలి.   గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్‌లు, డాక్యుమెంట్లు, APK ఫైల్‌లు ఓపెన్ చేయవద్దు. ఫోన్‌లోని ప్రతి యాప్‌కు ఇచ్చే permissionsను అప్రమత్తంగా పరిశీలించండి. బ్యాంక్ అకౌంట్, UPI, కార్డు వివరాలను ఎవరితోనూ పంచుకోకండి.

మీరు ఫోన్‌లో అనుమానాస్పద యాప్ ఇన్‌స్టాల్ చేసినట్లయితే వెంటనే ఆ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. మొబైల్‌ను Reset చేసి, ట్రస్ట్ చేసిన యాప్‌లను మాత్రమే తిరిగి ఇన్‌స్టాల్ చేయండి. ఫోన్‌లో భద్రతా యాప్ (Anti-virus/Anti-Malware) ఉపయోగించండి. బ్యాంకింగ్ అప్లికేషన్లలో Bio-metric/2-Factor Authentication వాడండి. మోసానికి గురైనవారు చేయవలసిన చర్యలు: తక్షణం 1930 నంబర్‌కు కాల్ చేయండి (National Cyber Helpline) www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయండి మీ దగ్గరలో గల పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి.

ప్రజలందరూ సైబర్ నేరాల పై అవగాహనతో ఉండాలి. నేటి మోసాలు ఆధునిక పద్ధతుల్లో జరుగుతున్నాయి. వాటిని గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలి. “ఎవరూ మోసపోకండి – ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి!”సైబర్ భద్రత జాగ్రత్తలు పాటించండి – మోసాల నుంచి దూరంగా ఉండండి.Apk ఫైల్స్ ను క్లిక్ చేసినట్లయితే వెంటనే మీ whatapp, ఫేస్ బుక్ .

ఇన్ స్టా గ్రాం వంటి యాప్ ల ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తారు.apk ఫైల్స్ లింకులను క్లిక్ చేయకూడదని మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వచ్చినప్పుడు, ముందుగా మీ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచాలి. దీని వల్ల ఇంటర్నెట్, కాల్స్, డేటా కనెక్షన్ తాత్కాలికంగా నిలిపివేయబడి, హ్యాకర్లు ఫోన్‌ను మరింత దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట వేయవచ్చన్నారు. సమీప సైబర్ ల్యాబ్ పోలీసులను సంప్రదించాలని జిల్లా ప్రజలకు డిఐజి, జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.

NO COMMENTS

Exit mobile version