సికింద్రాబాద్ : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో మెరుగైన వైద్య సేవలను అందిస్తూ మెడికవర్ ఆసుపత్రి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు.
సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో స్ట్రైకర్ మాకో ఆర్థోపెడిక్ రోబోటిక్ యంత్రాన్ని హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఆస్పత్రి చైర్మన్ అనిల్ కృష్ణ,ఎండి హరికృష్ణ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రోబోటిక్ యంత్రం పనిచేసే తీరును వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పుల మాదిరిగానే వైద్యరంగంలోనూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ శస్త్ర చికిత్సలు నిర్వహించడం మంచి పరిణామం అని అన్నారు. ఆర్థోపెడిక్ విభాగంలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఉద్దేశంతో నూతనంగా తీసుకువచ్చిన రోబోటిక్ యంత్రం మూలంగా అనేక సత్ఫలితాలు ఉంటాయని అన్నారు.
వైద్యుల సమయం వృధా కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ సర్జరీలు చేసేందుకు వెసులుబాటు కలుగుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మెడికవర్ ఆసుపత్రులు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వారు మరింత గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
#sidhumaroju
