గుంటూరు జనవరి 21: జిల్లాలో ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు అధికారులను ఆదేశించారు.
ల్యాండ్ సర్వే పూర్తయిన ప్రాంతాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
బ్యాంకులు లబ్ధిదారులకు రుణాలు త్వరగా మంజూరు చేయాలని, ప్రతి వారం ప్రగతి నివేదిక రావాలని స్పష్టం చేశారు.మార్చి 31 లోపు పెండింగ్ పనులు పూర్తి చేయాలని, కొన్ని గ్రామాల్లో 100% సూర్య ఘర్ అమలు లక్ష్యంగా పని చేయాలని తెలిపారు.
ప్రస్తుత ప్రగతి
రిజిస్ట్రేషన్లు: 18,285
సోలార్ ఏర్పాటు గృహాలు: 6,165.
