మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సీటీఎం రోడ్డులో టౌన్ బ్యాంక్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు తనిఖీలు చేపట్టారు.
ట్రాఫిక్ సీఐ గురునాథ్, ఎస్ఐ గాయత్రి ఆధ్వర్యంలో సిబ్బంది పాల్గొని, ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగించారు. నో పార్కింగ్‌లో ఉన్న వాహనాలకు జరిమానాలు విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
