కర్నూలు : నంద్యాల : డోన్ : ఈ రోజు బేతంచర్ల పట్టణంలోని సుందరయ్య కాలనీలో ఏర్పాటు చేసిన నీటి బోరు మరియు సీసీ రోడ్డు నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి గారు హాజరై భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రజల మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సుందరయ్య కాలనీలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు, సీసీ రోడ్డు నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించారు.
