గుంటూరు, జనవరి 22:రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 14,000 సిసిటివి కెమెరాలన్నీ నిరంతరం సక్రమంగా పనిచేయాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గారు అధికారులను ఆదేశించారు.
ఎపి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో,
నేరాల నియంత్రణ
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ
కోసం సిసిటివి కెమెరాలను రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్తో అనుసంధానించి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ గారు తదితర అధికారులు పాల్గొన్నారు.
