గుంటూరు, జనవరి 22 : పది పరీక్షల్లో గుంటూరు జిల్లా నుంచే స్టేట్ టాపర్‌లు రావాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు, ఐ.ఏ.ఎస్. పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహించిన “విజయం మనదే” కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్,
పదవ తరగతి భవిష్యత్తుకు తొలి మెట్టు.
భయం కాదు ఆత్మవిశ్వాసమే విజయానికి మార్గం
ప్రతి మార్కు విలువైనదే
పెద్ద గోల్ పెట్టుకుని నిరంతరం విజువలైజేషన్ చేయాలి అని విద్యార్థులకు ప్రేరణ ఇచ్చారు.
మీ భవిష్యత్తు బాగుండాలి… తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి చేరాలి” అని ఆకాంక్షించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో
అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు
ఒత్తిడి లేని విద్య
ఉచిత సౌకర్యాలు.
ఉన్నాయని పేర్కొంటూ, ఈ అవకాశాలను మంచి భవిష్యత్తుకు వినియోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమానికి ఉత్తేజితులైన విద్యార్థులు
“స్టేట్ టాపర్‌లు అవుతాం… మీతో కంగ్రాట్స్ చెప్పించుకుంటాం” అని నినదించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డా. షేక్ సలీం భాషా గారు,ఇతర విద్యాశాఖ అధికారులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గోల్ పెద్దదైతే… విజయం గొప్పదే!
