Home South Zone Telangana కన్నెత్తి చూడని మంత్రులు, అధికారులు …

కన్నెత్తి చూడని మంత్రులు, అధికారులు …

0

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని నిర్మించిన రామదాసును ఇటు ప్రభుత్వం, అటు ఆలయ అధికారులు మరిచిపోతున్నారా అంటే అవుననే అంటున్నారు.

. నేలకొండపల్లి వాసులు.. కొన్నేళ్ల క్రితం రామదాసు జన్మస్థలాన్ని  గుర్తుచేసుకున్న అధికారులు అక్కడ భక్తరామదాసు ద్యాన మందిరం, ఆడిటోరియంతో పాటు భక్తరామదాసు కాంస్య విగ్రహాన్ని నిర్మించారు కానీ జయంతి ఉత్సవాలను మరిచారు. అప్పుడప్పుడు సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరిపారు.

కానీ నేడు జరుగుతున్న రామదాసు జయంతి ఉత్సవాల తీరు పట్ల నేలకొండపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా లో డిప్యూటీ ముఖ్యమంత్రి తో పాటు మరో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. ఇది ఇలా ఉంటే కనీసం ఉన్నతాధికారులు కానీ మండల స్థాయి అధికారులు కానీ అటు వైపు కన్నెత్తి కూడా చూడ లేదంటే ఉత్సవాలు ఏవిధంగా జరుగుతున్నాయో ఇట్టే అర్థం అవుతోంది.

అధికారులు, నిర్వహాకుల తీరు పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version