Home South Zone Telangana ఆకస్మికంగా తనిఖీ చేసిన :: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్

ఆకస్మికంగా తనిఖీ చేసిన :: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్

0

మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.

కార్యాలయ పరిసరాల్లో స్క్రాప్‌ను తొలగించి, పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రజల నుండి వచ్చే దరఖాస్తులను సావధానంగా పరిశీలించి, పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్ పరిధిలో త్రాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, కమిషనర్ రాజేశ్వర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version