Home South Zone Telangana హైదరాబాద్ హోటల్లలో దోష పూరి బంద్ – ముంచుకొస్తున్న మూసివేత గండం .|

హైదరాబాద్ హోటల్లలో దోష పూరి బంద్ – ముంచుకొస్తున్న మూసివేత గండం .|

0

హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు భాగ్యనగరవాసుల కడుపు కొడుతున్నాయి.
అంతర్జాతీయంగా గ్యాస్ దిగుమతులు నిలిచిపోవడంతో నగరంలోని కమర్షియల్ ఎల్పీజీ (LPG) సరఫరాలో దాదాపు 75 శాతం కోత విధించారు. ఈ భారీ కొరత కారణంగా నగరంలోని వేలాది హోటళ్లు, పిజి (PG) హాస్టళ్లు మరియు మెస్‌లు సంక్షోభంలో కూరుకుపోయాయి
గ్యాస్ వినియోగాన్ని ఆదా చేసేందుకు హైదరాబాద్ ఐటీ కారిడార్ హోటళ్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వండేందుకు ఎక్కువ సమయం మరియు గ్యాస్ తీసుకునే దోశ, పూరి, వడ, చపాతీ వంటి పదార్థాలను తాత్కాలికంగా మెనూ నుండి తొలగించినట్లు ప్రకటించింది.
కేవలం తక్కువ సమయంలో పూర్తయ్యే ఇడ్లీ, ఉప్మా వంటి పదార్థాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాకుండా, గ్యాస్ ఆదా కోసం టీ, కాఫీ విక్రయాలను కూడా పలు చోట్ల నిలిపివేశారు.
ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి వంటి ఐటీ హబ్‌లలో ఉన్న పిజి హాస్టళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సరఫరా లేకపోవడంతో నిత్యావసరంగా వండే అల్పాహారాలను నిలిపివేసి, కేవలం అన్నం, పప్పు, సాంబార్ వంటి సాదాసీదా భోజనాన్ని మాత్రమే వడ్డిస్తున్నారు.
గ్యాస్ నిల్వలు మరో రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, సరఫరా పునరుద్ధరించకపోతే హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయడం తప్పదని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు కొరత వేధిస్తుంటే, మరోవైపు గ్యాస్ ధరల పెంపు జేబులకు చిల్లు పెడుతోంది. వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెరగడంతో, హోటళ్లు తమ వంటకాలపై ధరలను సవరించాయి.
దోశ, పూరి వంటి అల్పాహారాలపై కనీసం రూ. 15 పెంపు.
ఇడ్లీ, ఉప్మా వంటి వాటిపై రూ. 10 అదనపు భారం.
మధ్యాహ్న భోజనం మరియు ప్లేట్ మీల్స్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ఇప్పటికే అత్యవసర సమావేశం నిర్వహించి, గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరింది.
కమర్షియల్ గ్యాస్‌ను అత్యవసర సేవల పరిధిలోకి తీసుకువచ్చి, నిరంతర సరఫరా జరిగేలా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నగరంలోని దాదాపు 74,000 హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
#sidhumaroju
Alwal

NO COMMENTS

Exit mobile version