బాపట్ల: బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించిన గోగినేని రామాంజనేయులు గారు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అడిషనల్ ఎస్పీ
బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా గోగినేని రామాంజనేయులు గారు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
గతంలో బాపట్ల డీఎస్పీగా విధులు నిర్వహించిన గోగినేని రామాంజనేయులు గారు ఇటీవల అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో ఆయనను బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా నియమిస్తూ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
#Narendra
