బాపట్ల: ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ నుండి పాత బస్టాండ్ వరకు ఘనంగా రహదారి భద్రతా అవగాహన ర్యాలీ
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు – 2026’లో భాగంగా బాపట్ల పట్టణంలో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీలో లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ, పాత బస్టాండ్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా ఎంపీ గారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారితో కలిసి విద్యార్థులు, యువతతో రహదారి నిబంధనలు పాటించేలాగా ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో DRO గంగాధర్, District RTO పారణసామీ రెడ్డి, DMHO విజయమ్మ, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
#Narendra
