చీరాల: ఇతర పార్టీలు బీసీలను కరివేపాకుల మాదిరి తీసేస్తే వారిని తులసి దళాలుగా మార్చిన ఘనత టిడిపి దని చీరాల నియోజకవర్గ టిడిపి బీసీ సెల్ అధ్యక్షుడు వెంగళ భరత్ బాబు చెప్పారు. చీరాల క్లాక్ టవర్ సెంటర్ లో
శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల సభలో ఆయన మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసే సాంప్రదాయాన్ని ఎన్టీఆర్ ప్రారంభిస్తే దానిని చంద్రబాబు, లోకేష్ లు పాటిస్తున్నారన్నారు. అందువల్లే అందరూ బీసీలకు రాజ్యాధికారం లభించింది అని కూడా భరత్ బాబు చెప్పారు.ఇందుకు చీరాల నియోజకవర్గమే
నిదర్శనమన్నారు.ఈ నేపథ్యంలో బీసీలు టిడిపికి సదా అండగా నిలవాలని భరత్ బాబు కోరారు.నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమాన్ని పట్టించుకొని వారికి బీమా సౌకర్యం కల్పించారని,తద్వారా ఆపద సమయంలో ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. యూత్ ఐకాన్ గా రూపుదిద్దుకున్న లోకేష్ ను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని భరత్ బాబు కోరారు.
#Narendra
