జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని దుస్తూరాబాద్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళాశాల విద్యార్థులు శుక్రవారం ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తహశీల్దార్ మాట్లాడుతూ.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటు ఒక శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. కుల, మత, జాతి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విద్యార్థులకు, యువతకు పిలుపునిచ్చారు.
