తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు, శుక్రవారం నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలను అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువగళం పాదయాత్రతో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చి, తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ నిరూపించుకున్నారని కొనియాడారు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన మొదటి నాయకుడు లోకేష్ అని
పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. అనంతరం అన్నదానం, కేక్ కటింగ్, బాణాసంచా కాల్చి వేడుకలు జరిగాయి.
