AP: నకిలీ మద్యం కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులకు భారీ ఊరట లభించింది. జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు తంబళ్లపల్లి కోర్డు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
ఇప్పటికే భవానీపురంలో నమోదైన కేసులో విజయవాడ ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో జోగి రమేష్ సోదరులు జైలు నుంచి విడుదల కానున్నారు. ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నట్లు సమాచారం.
