Home South Zone Andhra Pradesh పుంగునూరు :పుంగనూరు లో కొండచిలువల కలకలం

పుంగునూరు :పుంగనూరు లో కొండచిలువల కలకలం

0

పుంగనూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామ సమీపంలోని మామిడి తోటలో రెండు భారీ కొండచిలువలు కలకలం సృష్టించాయి. సుమారు 13 అడుగుల పొడవున్న ఈ కొండచిలువలను పశువుల కాపరులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు.

శుక్రవారం బీట్ ఆఫీసర్ శోభనాద్రి నేతృత్వంలోని రెస్క్యూ బృందం మూడు గంటల పాటు శ్రమించి వీటిని చాకచక్యంగా పట్టుకుంది. అనంతరం వాటిని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్థులు, అధికారులు అప్రమత్తమయ్యారు# కొత్తూరు మురళి .

NO COMMENTS

Exit mobile version