కర్నూలు
గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు అన్నారు… ఎంపీ నాగరాజు గారు తన సొంత గ్రామమైన కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాలలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రూ.1 కోటి 80 లక్షలతో నిర్మిస్తున్న నూతన సీ.సీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను ఎంపీ గారు పరిశీలించారు.
.ఈ సందర్భంగా పనుల వివరాలను అధికారులు, కాంట్రాక్టర్ తో అడిగి తెలుసుకున్నారు…అనంతరం ఎంపీ నాగరాజు గారు మాట్లాడుతూ పల్లెల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి సీ.ఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు..ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ శాఖ ఏ.ఈ నాగరాజు, కాంట్రాక్టర్ నాగేష్, గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు…
