AP: ఏడాది క్రితం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. శనివారం చిత్తూరు జిల్లా నగరిలో ఆయన మాట్లాడుతూ..
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, మన జీవన విధానం కావాలని పిలుపునిచ్చారు. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు.
మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలని, చెడు ఆలోచనలతో నేరస్థులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశామన్నారు.
