Monday, January 26, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి: గుంటూరు జిల్లా పోలీసుల విజ్ఞప్తి

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి: గుంటూరు జిల్లా పోలీసుల విజ్ఞప్తి

సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మొదలైన నేరాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గుంటూరు జిల్లా ఎస్పీ గారు వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు జిల్లా పోలీస్ అధికారులతో వివిధ పద్దతులలో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది.

ఈ అవగాహన కార్యక్రమాల వలన ప్రజలలో చైతన్యం వచ్చి కొంతమంది వచ్చిన ఫోన్ కాల్స్ పై అనుమానం రాగానే పోలీసు వారిని సంప్రధించి సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడటం జరుగుతుంది.
ముఖ్యంగా ,సీనియర్ సిటిజెన్ కు WhatsApp కాల్స్ చేసి మీమీద మనీ లాండరింగ్ కేసు ఉంది అంటూ స్టేట్ మెంట్ రికార్డు చేసి తప్పించాలంటే డబ్బులు డిపాజిట్ చేయమని బెదిరిoపు ఫోన్ కాల్స్ వచ్చి నప్పుడు వెంటనే సైబర్ పోలీసు వారిని సంప్రదించి సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడవలసినదిగా తెలపడం అయినది.

సీనియర్ సిటిజెన్ కు, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు WhatsApp కాల్స్ చేసి సిబిఐ నుండి నుండి పోలీసు అని చెప్పి మీ ఫోన్ ద్వారా అశ్లీల ఫోటోలు పంపినట్లు కేసు నమోదైంది, దానిని నుండి మీ పేరు తొలగించాలంటే డబ్బులు డిపాజిట్ చేయమని బెదిరింపు కాల్స్ వస్తే, వెంటనే సైబర్ పోలీసు వారిని సంప్రదించి సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడవలసినదిగా తెల్పడమైనది.

సైబర్ మోసగాళ్లు, పోలీస్ / కోర్టు / కస్టమ్స్ / టెలికాం అధికారులమని చెప్పుకొని WhatsApp కాల్స్ చేస్తారు. నకిలీ FIRలు చూపించి “డిజిటల్ అరెస్ట్” అంటూ భయపెడతారు. మీ ఆదార్, సిమ్ కార్డు పేరుతో మనీ లాండరింగ్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులని చెబుతారు. అరెస్ట్ తప్పించాలంటే వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయమని ఒత్తిడి చేస్తారు
పోలీసులు

ఎప్పటికీ ఫోన్ లేదా WhatsApp ద్వారా డబ్బులు అడగరు, ఎలాంటి లింక్‌లను ఓపెన్ చేయవద్దు – డబ్బులు పంపవద్దు. అనుమానాస్పద కాల్ వస్తే వెంటనే కట్ చేయండి. సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించండి లేదా 1930 కు కాల్ చేయండి. మరియు మీ ఫోన్లో వచ్చే ఎలాంటి APK ఫైల్స్ ఓపెన్ చేయకండి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments