ఏపీ ప్రభుత్వం వీధి వ్యాపారులకు భారీ శుభవార్త చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా వ్యాపారం సాగేందుకు రూ.30 వేల పరిమితితో ప్రత్యేక క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని తొలుత తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.
ఐదేళ్ల చెల్లుబాటు ఉన్న ఈ కార్డు ద్వారా 20 నుంచి 50 రోజుల వరకు వడ్డీ లేకుండా నగదు వినియోగించుకోవచ్చు. అలాగే పీఎం స్వనిధి పథకం కింద పూచీకత్తు లేకుండా రూ.50 వేల వరకు రుణం పొందే అవకాశం ఉంది. త్వరలో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
