Home South Zone Andhra Pradesh కోడుమూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ పుట్టిన రోజు వేడుక

కోడుమూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ పుట్టిన రోజు వేడుక

0

కర్నూలు
కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారి ఆధ్వర్యంలో మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టిన రోజు వేడుకలుకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు,యువనేత నారా లోకేష్ గారి పుట్టిన రోజు వేడుకలను కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నారా లోకేష్ గారి నాయకత్వాన్ని కొనియాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు మాట్లాడుతూ —“యువత ఆశల ప్రతీక నారా లోకేష్ గారు.

ప్రజాసేవ పట్ల అంకితభావంతో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు.ఆయన నాయకత్వంలో టీడీపీ మరింత బలోపేతమై, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రంగా మారడం ఖాయం”— అని తెలిపారు అలాగే పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్.మండల, గ్రామ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version