Home South Zone Andhra Pradesh నందివెలుగు రోడ్డులో కల్వర్టు నిర్మాణానికి అనుమతులివ్వండి.

నందివెలుగు రోడ్డులో కల్వర్టు నిర్మాణానికి అనుమతులివ్వండి.

0

గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నందివెలుగు రోడ్డులో జాకీర్ హుస్సేన్ నగర్ వద్ద కల్వర్టు నిర్మాణానికి వెంటనే పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని వెలగపూడి సచివాలయంలో కలిసి విన్నవించాం.

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కల్వర్టు నిర్మాణం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనే విషయాన్ని మంత్రి గారికి తెలియజేశాం. జాకీర్ హుస్సేన్ నగర్ లో రోడ్డు ప్రస్తుతం ఇరువైపులా వంద అడుగుల మేర ఉందని, కల్వర్టు మాత్రం కేవలం 30 అడుగులు మాత్రమే ఉందని, ఈ కారణంగా ట్రాఫిక్ తోపాటు భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని వివరించాం.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నందివెలుగు బ్రిడ్జి నిర్మాణం వేగవంతంగా చేపట్టామని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ రహదారిలో వాహనాల రాకపోకలు మరింత పెరిగి ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందనే విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను.

ఇప్పటికే కల్వర్టు నిర్మాణానికి ఇంజినీరింగ్ అధికారులు రూ.2.52 కోట్లతో అంచనాలు రూపొందించారని, ప్రతిష్టాత్మకమైన, ప్రజోపయోగకమైన కల్వర్టు నిర్మాణానికి వెంటనే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయాలని విన్నవించాను. నా వినతి మేరకు సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

NO COMMENTS

Exit mobile version