అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కు వై ప్లస్ భద్రత కల్పిస్తున్న చెన్నారెడ్డి అనే సీఆర్పీఎఫ్ జవాన్, కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం రాత్రి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శుక్రవారం పుంగనూరు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మదనపల్లె డిఎస్పి మహేంద్ర ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు# కొత్తూరు మురళి.
