Home South Zone Andhra Pradesh మంత్రి నారా లోకేష్ పేరున శివాలయంలో పూజలు

మంత్రి నారా లోకేష్ పేరున శివాలయంలో పూజలు

0

మంత్రి లోకేష్ పేరున శివాలయంలో పూజలు…

మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ టీఎన్ టియూసీ ప్రధాన కార్యదర్శి గోసాల రాఘవ ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి లోకేష్ పేరున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఆయుష్ హోమం పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బోగి కోటేశ్వరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు బాపనపల్లి వాసు, నైనాల లావణ్య, టీడీపీ నాయకులు పడవల మహేష్, షేక్ రియాజ్, దామర్ల రాజు, వాకా మాధవరావు, గోవాడ దుర్గారావు, జొన్నాదుల బాలకృష్ణ, వల్లభనేని భార్గవ్, అన్నం నాగబాబు, నల్ల గొర్ల బుల్లబ్బాయి, నల్లగొర్ల శివరామకృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

– బాపనపల్లి శ్రీనివాస్, జర్నలిస్ట్.

NO COMMENTS

Exit mobile version