Home South Zone Andhra Pradesh మదనపల్లెలో పగటి వేళ భారీ వాహనాలకు నో ఎంట్రీ.

మదనపల్లెలో పగటి వేళ భారీ వాహనాలకు నో ఎంట్రీ.

0

మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పట్టణంలోకి లారీలు, భారీ వాహనాలు, ట్రాక్టర్లకు అనుమతి లేదని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎస్. గురునాథ్ తెలిపారు.

సరుకు రవాణా వాహనాలు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే అన్లోడింగ్ చేసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

NO COMMENTS

Exit mobile version