AP: రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రూ.11.05 కోట్ల వ్యయంతో బ్లడ్ ఫిల్టరేషన్ మెషీన్లు అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
ఎస్.కోట, సీతంపేటలో కొత్తగా నిర్మించిన ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. కిడ్నీ రోగుల చికిత్సకు 2024-25లో ప్రభుత్వం రూ.164 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు.
