AP: గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో జనవరి 25న మధ్యాహ్నం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు.
రాబోయే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన కీలక అంశాలపై చంద్రబాబు పార్టీ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు.
