కర్నూలు
డోన్ పట్టణంలో PM–SVANidhi 2.0 పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా – 270 మందికి రూ.45.30 లక్షల రుణాలు మంజూరుడోన్ పట్టణ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న క్లబ్ హౌస్‌లో ఈ రోజు డోన్ మెప్మ (MEPMA) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో అమలవుతున్న PM–SVANidhi 2.0 పథకం ద్వారా వీధి వ్యాపారుల ఆర్థిక అభివృద్ధికి అందుతున్న సహాయంపై అవగాహన కల్పించారు.
ఈ పథకం కింద డోన్ పట్టణంలో మొత్తం 270 మంది వీధి వ్యాపారులకు రూ.45,30,000/- (అక్షరాలా రూపాయలు నలభై ఐదు లక్షల ముప్పై వేల మాత్రమే) రుణాలు మంజూరైనట్లు అధికారులు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి* గారు మాట్లాడుతూ, చిన్న వ్యాపారులు మరియు వీధి వ్యాపారులు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం PM–SVANidhi 2.0 పథకాన్ని ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.
ఈ పథకం ద్వారా వ్యాపార విస్తరణకు అవసరమైన మూలధనం లభించి, వ్యాపారుల జీవన ప్రమాణం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.డోన్ పట్టణంలో అర్హులైన మరింత మంది వీధి వ్యాపారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గారు కోరారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన మరియు రుణ మంజూరు ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయడంలో మున్సిపల్ శాఖ.
మెప్మ సిబ్బంది ప్రజల పక్షాన నిలబడి పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో భాగంగా వీధి వ్యాపారుల చేతికి క్రెడిట్ కార్డులు అందించగా, పథకం ద్వారా మంజూరైన రుణాల విలువను ప్రతిబింబించే మెగా చెక్‌ను ఎమ్మెల్యే గారు ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మెప్మ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు వీధి వ్యాపారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
