కర్నూలు
స్మశాన వాటికలు శుభ్రంగా ఉంచండి నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్నగర పరిధిలోని స్మశాన వాటికలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా సంబంధిత పారిశుద్ధ్య తనిఖీదారులు ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు.
శుక్రవారం 6వ వార్డు గడ్డ వీధిలోని అంఖబ్రస్తాన్ బటౌ స్మశాన వాటికను కమిషనర్ పరిశీలించారు. వచ్చే నెల బడేరాత్ సందర్భంగా స్మశానంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట్ల విద్యుత్ దీపాలు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, నీటి వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగప్రసాద్ బాబు, టిఏఈ స్వాతి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, స్థానిక నాయకులు హకీం తదితరులు పాల్గొన్నారు.
