ఈ నెల 26న మదనపల్లి బెంగళూరు రోడ్డులోని బీటీ కళాశాల మైదానంలో జరిగే 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ జిల్లా అధికారులను గురువారం ఆదేశించారు.
ముందస్తు ఏర్పాట్లపై సమావేశం నిర్వహించి, అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రతిబింబించేలా శకటాలు, ఎగ్జిబిషన్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకునేలా ఏర్పాటు చేయాలని తెలిపారు.
