AP LRS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్న పనులు.. టైముకి పూర్తవ్వట్లేదు. LRS కోసం ఇచ్చిన గడువు ఏమాత్రం సరిపోలేదు. ప్రజలు ఆసక్తి చూపలేదు. దాంతో ప్రభుత్వం గడువును పొడిగించింది. ఇప్పుడైనా ఈ ఛాన్స్ ఉపయోగించుకోవాలని అంటోంది. దీని పూర్తి వివరాలు చూద్దాం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
.. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గడువును ఏప్రిల్ 23 వరకూ పెంచింది. దీని ద్వారా అనధికారిక లేఔట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. ఇదే చివరి అవకాశం అని ప్రభుత్వం చెప్పింది. నిజానికి ఈ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) దరఖాస్తుల గడువు జనవరి 23తో ముగిసింది.
ఇప్పుడు గడువు పెంచడం ద్వారా ప్రజలకు ఇది మరో ఛాన్స్ లాంటిది అనుకోవచ్చు. ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెరగనున్నాయి. అందువల్ల ప్రజలు.. ఆ పెంపు తర్వాత LRS సంగతి చూసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ప్రభుత్వం గడువును ఏకంగా ఏప్రిల్ 23 దాకా ఇచ్చింది. 3 నెలలు అదనంగా ఇచ్చింది.
