అన్నమయ్య జిల్లా కలికిరి అప్‌గ్రేడ్ స్టేషన్ CI రామచంద్ర ఉత్తమ అవార్డు అందుకున్న నాడే బదిలీ అయ్యారు. మదనపల్లి గణతంత్ర వేడుకల్లో..
విధి నిర్వహణలో విశేష సేవలు అందించినందుకు CIకి SP ధీరజ్ కునుబిల్లి IPS అవార్డును అందించి అభినందించారు. కాగా అదేరోజు సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన ట్రాన్స్‌ఫర్ అయ్యారు. బదిలీ అయిన CIని స్టేషన్‌లో SI రమణయ్య, సిబ్బంది శాలువాలు కప్పి పూలమాలలు వేసి సోమవారం వీడ్కోలు పలికారు.
