Home South Zone Andhra Pradesh మదనపల్లెలో మహిళ అదృశ్యం: కేసు నమో

మదనపల్లెలో మహిళ అదృశ్యం: కేసు నమో

0

మదనపల్లె కోళ్లబైలు గ్రామ పరిధిలోని వెంకటేశ్వరపురానికి చెందిన మెహతాజ్ బేగం అనే మహిళ అదృశ్యమైనట్లు పోలీసులు శనివారం ధ్రువీకరించారు. బాధితురాలి భర్త షేక్ మహమ్మద్ రవూఫ్ తెలిపిన వివరాల ప్రకారం, మెహతాజ్ బేగం రాత్రి సమయంలో తన పిల్లల కోసం తినుబండారాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లారు.

ఎంత సమయం గడిచినా ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో భర్త రవూఫ్ శనివారం మదనపల్లె తాలూకా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

NO COMMENTS

Exit mobile version