అన్నమయ్య జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 22,149 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
వీరి కోసం 124 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం 9 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ముఖ్యంగా సమస్యాత్మకమైన 8 కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని డీఈవో సుబ్రహ్మణ్యం సూచించారు.
