Home South Zone Andhra Pradesh ముత్తిన రామకృష్ణను పరామర్శించిన రామచంద్రయాదవ్ |

ముత్తిన రామకృష్ణను పరామర్శించిన రామచంద్రయాదవ్ |

0

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గత నెలలో కొందరు వ్యక్తులు డాడీ సంఘటనలో గాయపడిన ముత్తిన రామకృష్ణని పరామర్శించిన బి సి వై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ గారు…

కత్తిపూడిలో బాధితుడు ముత్తిన రామకృష్ణ గారిని పలకరించి దాడికి సంబందించి సంఘటన వివరాలు తెలుసుకోవడం జరిగింది…

దీనిపై పత్రిక మీడియా సమావేశం ద్వారా ఎవరు అయితే దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని, దాడికి జరిగిన సంఘటన పూర్తి విచారణ చేపట్టి బాధితుడికి న్యాయం చేయాలని పోలీస్ వారిని కోరడం జరిగింది… ఈ కూటమి ప్రభుత్వంలో BC సోదరులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, దీనికి పూర్తి బాధ్యత CM చంద్రబాబునాయుడు, మంత్రులు లోకేష్, అనిత బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు…

BCY పార్టీ అధికారంలోకి వస్తే BC సోదరులకు రక్షణ చట్టం తీసుకొస్తానని తెలియజేయడం జరిగింది… బాధిత కుటంబానికి 50,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది… బాధిత కుటంబానికి, BC సోదరాలకు అన్నివిధాలా అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రములో ప్రత్తిపాడు నియోజకవర్గ BCY నాయకురాలు అనూష యాదవ్ గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుండి యాదవ్ సోదరులు పాల్గొన్నారు…

#dadala babji

NO COMMENTS

Exit mobile version