Home South Zone Andhra Pradesh చీరాలలో తెల్లవారుజామున దొంగల బీభత్సం

చీరాలలో తెల్లవారుజామున దొంగల బీభత్సం

0

చీరాల: 8 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణబాపట్ల జిల్లా, చీరాల మండల పరిధిలోని గాంధీనగర్ పంచాయతీలో ఉన్న మహాత్మా గాంధీ హౌసింగ్ కాలనీలో నివాసం ఉంటున్న ఆంజనేయులు ఇంటిలోకి మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు.

అడ్డొచ్చిన వారిపై దాడి చేస్తూ, ఇంట్లో ఉన్న మహిళ ఒంటిపై ధరించిన 8 సవర్ల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version