మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్‌లో మంగళవారం భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. అతని మృతదేహాన్ని టూ టౌన్ పోలీసులు బోధన ఆసుపత్రి మార్చురీలో ఉంచారు.
వారం రోజుల పాటు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, మానవతావాద సంస్థ ‘హెల్పింగ్ మైండ్స్’ స్పందించి హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హిందూ, ముస్లిం సోదరులు పాల్గొనడం విశేషం. 13 ఏళ్లుగా అనాథలకు చివరి మజిలీ కల్పిస్తూ ‘హెల్పింగ్ మైండ్స్’ మానవత్వాన్ని చాటుతోంది.
