Home South Zone Andhra Pradesh Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ కీలక అంశాలపై చర్చ!

Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ కీలక అంశాలపై చర్చ!

0

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకు కేబినెట్ సమావేశం
వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
మధ్యాహ్నం 3 గంటలకు గ్రీన్ కవర్ అంశంపై సమీక్ష నిర్వహించనున్న సీఎం
సాయంత్రం 4 గంటలకు రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై కేబినెట్ విస్తృతంగా చర్చించనుంది. అలాగే ప్రాధాన్యత కలిగిన అంశాలకు ఆమోదం తెలిపే అవకాశముంది.

అధికార వర్గాల సమాచారం ప్రకారం, సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 10.15 గంటలకు సచివాలయానికి చేరుకుని అనంతరం కేబినెట్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత పర్యావరణ శాఖ అధికారులతో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గ్రీన్ కవర్ అంశంపై సమీక్ష నిర్వహించి, పచ్చదనం పెంపుదల, అటవీ విస్తీర్ణం విస్తరణపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు.

అనంతరం సాయంత్రం 4 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న, నూతనంగా చేపట్టిన రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాగుతున్న రైల్వే పనులను వేగవంతం చేయాలని అధికారులకు కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. రోజంతా వరుస సమీక్షలు, అధికారిక సమావేశాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 6.45 గంటలకు సీఎం తన నివాసానికి తిరిగి చేరుకోనున్నారు.

NO COMMENTS

Exit mobile version