Home South Zone Andhra Pradesh YS Jagan: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం.

YS Jagan: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం.

0

YS Jagan: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం

ఉదయం 11 గంటలకు వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం
నియోజకవర్గంలోని సమస్యలు, రాజకీయ పరిణామాలపై చర్చించనున్న జగన్
గత వారం ఏలూరు నియోజకవర్గ నేతలతో సమావేశమైన వైనం

వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఆయన భేటీ అవుతారు. ప్రధానంగా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలపై జగన్ చర్చించనున్నారు.

ప్రతి బుధవారం రాష్ట్రంలోని ఒక నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, వైసీపీ ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకున్న పార్టీ అధినేత వైఎస్ జగన్ గత వారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరించిన వైఎస్ జగన్ .. పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యల గురించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

NO COMMENTS

Exit mobile version