కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శివారు రావికంపాడు వెళ్ళు జంక్షన్ వద్ద గురువారం తెల్లవారుజామున కంటైనర్ వాహనం, వేరేవాహనం ఢీకొన్న సంఘటనలో భారీ అగ్నీకీలలు వ్యాపించాయి. చేపల మేతతో వెళ్తున్న లారీని కంటైనర్ డీకొట్టడంతో ఇంజెన్లు నుండి మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించడం జరిగింది, డ్రైవర్స్ ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు..
కంటైనర్ క్లీనర్ అగ్నికీలలుకు సజీవ దహనం అయ్యారు..
హైవే రెస్క్యూ వాహనాలు, అoబులెన్సు వాహనాలు సంఘటన ప్రాంతానికి చేరి మంటలు అదుపు చేయడం జరిగింది… ట్రాఫిక్ అంతరాయము ఏర్పడటం వలన అన్నవరం పోలీసులు దగ్గర ఉండి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు..
#dadala babji
