కొండ ప్రాంత వాసులకు బాసటగా ఎమ్మెల్యే సుజనా చౌదరి..
పశ్చిమ నియోజకవర్గంలో కొండప్రాంత నిర్వాసితులకు ప్రత్యామ్నాయ నివాసాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి జిల్లా కలెక్టర్ ను కోరారు. గత రెండు సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలోని మల్లిఖార్జునపేట, కొత్తపేట, లంబాడీ పేట, విద్యాధరపురం తదితర ప్రాంతాల్లో కొండలపై నివసించే వారి ఇళ్లు శిధిలావస్థకు చేరాయి
వర్షాకాలంలో 38, 44, 46, 52 డివిజన్ లకు సంబంధించిన కొండ ప్రాంత నివాసితుల ఇళ్లు వర్షాలకు కూలిపోవడం, కొండ చరియలు పడటం వల్ల కొంత మంది నిర్వాసితులయ్యారు.. వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం శాసనసభ్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే కొండపై ఇళ్లు ఖాళీ చేసి వచేస్తామని ఎమ్మెల్యే కు తెలిపారు.. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఈ మేరకు కలెక్టర్ తో మాట్లాడి వారికి ప్రత్యామ్నాయ నివాసాలు ఏర్పాటు చేయాలని కోరారు.
. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ ఈరోజు ఆయా డివిజన్లు చెందిన 36 మంది నిర్వాసితులను కలెక్టర్ వద్దకు తీసుకు వెళ్లారు.. నిర్వాసితుల సమస్యను శ్రీధర్ కలెక్టర్ ముందుంచారు. వారి సమస్యలను వివరించారు. కలెక్టర్ గారు రెండు వారాల్లోగా వారందరికీ ప్రభుత్వ పథకం ద్వారా ఇళ్లు కేటాయించే ఏర్పాట్లను చేస్తానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు…
సుజనా చౌదరి కి నిర్వాసితులు ధన్యవాదాలు తెలిపారు..
కార్యక్రమంలో కూటమి నాయకులు బేసి కంటేశ్వరుడు,
సుజనా మిత్ర లు దొడ్ల రాజా, సప్పా శ్రీనివాస్ ..నిర్వాసితుల పాల్గొన్నారు..
