ఆస్తిలో వాటా అడిగినందుకు అక్కపై తమ్ముడు కర్రతో దాడి చేసిన ఘటన బుధవారం నిమ్మనపల్లిలో చోటు చేసుకుంది. గార బురుజు వడ్డీపల్లికి చెందిన రెడ్డమ్మ (56) తన తండ్రి నుంచి వచ్చిన మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో వాటా
అడగడంతో, ఆ భూమిని సాగు చేసుకుంటున్న తమ్ముడు మంజునాథ ఆగ్రహించి కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి తరలించగా, నిమ్మనపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
