దర్శి మున్సిపల్ పరిధిలో, గురువారం సాయంత్రం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం, అద్దంకి రోడ్డులోని జోముకాలువ నిర్మాణానికి సంబంధించి రూ. 50,46,000 వ్యయంతో చేపట్టనున్న పనులకు భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారు, టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత సాగర్ గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, మున్సిపల్ కమిషనర్ మహేష్ గారు, స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు
