శుక్రవారం, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయాన్ని అన్నమయ్య జిల్లా డి ఐ జి కోయ ప్రవీణ్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తదితరులు దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సోమల మండలానికి చెందిన ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, నాయకులు జనార్ధన్, శివ శంకర్ తదితరులు ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు
# కొత్తూరు మురళి.
