Home South Zone Andhra Pradesh చరిత్ర సృష్టించిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ |

చరిత్ర సృష్టించిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ |

0

వక్ఫ్ బోర్డు చరిత్రలో తొలిసారి.
చరిత్రలో లేని విధంగా నూతన అధ్యాయానికి నాంది పలికిన ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.
రేపు కసుమూరు లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అన్నదాన సత్రం ప్రారంభం.
హాజరుకానున్న మైనారిటీ మంత్రి శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి నస్యం మొహమ్మద్ ఫరూక్.

గతంలో ఎప్పుడూ లేని విధంగా, వక్ఫ్ బోర్డు చరిత్రలోనే ఒక వినూత్న అధ్యాయానికి నాంది పలికారు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్. ఆయన నాయకత్వంలో ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో కసుమూరు లో నిత్య అన్నదాన సత్రం (లంగర్ ఖానా) తో పాటు “తాలిం-ఎ-హునార్” పేరుతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను రేపు ఘనంగా ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి మైనారిటీ శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి నస్యం మొహమ్మద్ ఫరూక్, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు పనబాక లక్ష్మి హాజరుకానున్నారు. పేదలు, అనాధలు, దర్గా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రతిరోజూ భోజనం అందించడమే లక్ష్యంగా నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేయడం విశేషం. అదే సమయంలో, మైనారిటీ యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు “తాలిం-ఎ-హునార్” స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించడం వక్ఫ్ బోర్డు సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది.

ప్రథమంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ల శిక్షణ అందించి శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయనున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, వక్ఫ్ ఆస్తులు కేవలం పరిరక్షణకే కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడాలి. నిత్య అన్నదానం, నైపుణ్య శిక్షణ ద్వారా వక్ఫ్ బోర్డు సామాజిక సేవలో కొత్త చరిత్ర సృష్టిస్తోంది అని తెలిపారు. స్థానికులు, ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, వక్ఫ్ బోర్డు చరిత్రలో ఇది మైలురాయిగా నిలుస్తుందని కొనియాడారు.

NO COMMENTS

Exit mobile version