పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లెలో మంగళవారం వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ సమన్వయ సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి సోమవారం తెలిపారు.
ఈ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది# కొత్తూరు మురళి.




