Wednesday, February 4, 2026
spot_img
HomeSouth ZoneTelanganaప్రిన్సిపాల్ ను సత్కారించిన అధ్యాపకులు

ప్రిన్సిపాల్ ను సత్కారించిన అధ్యాపకులు

మహబూబాబాద్/కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఐదు సంవత్సరాల సర్వీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రిన్సిపాల్ బి. వెంకన్న గారిని కళాశాల అధ్యాపక బృందం ఘనంగా సత్కరించింది.

​గత ఐదేళ్లుగా కళాశాల అభివృద్ధిలో, విద్యార్థుల క్రమశిక్షణ మరియు ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంలో వెంకన్న గారు విశేష కృషి చేశారని అధ్యాపకులు కొనియాడారు. పరిపాలనలో ఆయన చూపిస్తున్న దక్షత, అందరినీ కలుపుకుపోయే తత్వం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు ఆయనకు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.

​అనంతరం ప్రిన్సిపాల్ వెంకన్న మాట్లాడుతూ.. తన ఐదేళ్ల ప్రస్థానంలో సహకరించిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సమిష్టి కృషితోనే కళాశాలను మరింత ముందుకు తీసుకువెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments