Wednesday, February 4, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు : ఆదోని పోలీసులు

మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు : ఆదోని పోలీసులు

కర్నూలు జిల్లా : ఆదోని
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి.. 30 రోజులు జైలు శిక్ష…

30 రోజులు జైలు శిక్ష విధిస్తూ జడ్జి ఆదేశం

ఆదోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భీమ్ సింగ్ అనే వ్యక్తి మద్యం సేవించి బొలెరో వాహనాన్ని నడుపుతూ పట్టబడినట్లు సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కోర్టులో హాజరు పరచగా, ఫస్ట్ ఆడిషనల్ జె ఎఫ్ సి ఎమ్ జడ్జి 30 రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ … మద్యం. సేవించి వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమన్నారు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అజాగ్రత్తగా నడపడం వల్ల ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున వడతాయన్నారు. ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీలు , డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు చేపడతామన్నారు. ముద్దాయి భీమ్ సింగ్ ను ఆదోని సబ్ జైలుకు తరలించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామ్ నాథ్, కానిస్టేబుల్ సురేష్ ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments